Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరుగు గెలిచినా ఉద్యోగం దక్కలేదు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:06 PM జాతీయంGeneral
పరుగు గెలిచినా ఉద్యోగం దక్కలేదు - Ushodayam
జార్ఖండ్‌కు చెందిన కవిత హోంగార్డ్‌ ఉద్యోగ ఎంపికలో నిరాశ ఎదుర్కొన్నారు. చీర కట్టుకుని, చెప్పులు లేకుండా 1,600 మీటర్ల పరుగును 8 నిమిషాల 57 సెకన్లలో పూర్తి చేసి అర్హత సాధించారు. అయితే హైజంప్‌లో మూడు ప్రయత్నాల్లోనూ విఫలమై అనర్హురాలయ్యారు. భర్త మరణంతో ఇద్దరు పిల్లలు, అత్తమామల పోషణ బాధ్యత కవితపై పడింది. ఆర్థిక ఇబ్బందుల మధ్య ఉద్యోగం కోసం ఆమె చేసిన ప్రయత్నం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...