Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట నష్టంపై రైతులకు ఆప్కాబ్ ఛైర్మన్ భరోసా

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:36 AM ఏలూరుGeneral
పంట నష్టంపై రైతులకు ఆప్కాబ్ ఛైర్మన్ భరోసా - Ushodayam
అర్నబ్ తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు రైతులకు భరోసా ఇచ్చారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో దెబ్బతిన్న వరి పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం వ్యవసాయ శాఖ, జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పంటల బీమా చెల్లించిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని, తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు వివరించారు.

Comments

G
Loading comments...