Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు గురై రైతు దుర్మరణం

Follow Ushodayam on Google
K. Anuradha Oct 03, 2026 6:54 PM శ్రీకాకుళంGeneral
పిడుగుపాటుకు గురై రైతు దుర్మరణం - Ushodayam
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం ఉద్దాన గోపినాథపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు చేస్తున్న రైతు కిర్ని గణేష్‌ (55)పై ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గణేష్‌ మృతిపట్ల పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విచారం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...