Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద నెమలిపురిలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ

Follow Ushodayam on Google
T. SRINU BABU Sep 01, 2026 12:44 PM పల్నాడుGeneral
పెద్ద నెమలిపురిలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ - Ushodayam
రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురి గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగింది. ఎంపీడీవో శ్రీనివాసరావు సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి వృద్ధులకు పింఛను నగదును అందజేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛను అందుతోందా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్న ఆయన, పింఛన్ల పంపిణీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...