Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్యంపై కమిషనర్ సమీక్ష

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:18 PM మహబూబాబాద్ General
పారిశుద్ధ్యంపై కమిషనర్ సమీక్ష - Ushodayam
మహబూబాబాద్‌ పట్టణ పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపల్‌ కమిషనర్‌ వినోద్‌ కుమార్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లతో సమీక్ష నిర్వహించారు. జీవీపీ ప్రాంతాలను గుర్తించి చెత్తను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణ పకడ్బందీగా చేపట్టాలని, స్వేచ్ఛగా సంచరించే పందులను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి తెలిపారు.

Comments

G
Loading comments...