Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాములా మెలికలు.. కొబ్బరి బొండాలు కోయలేని పరిస్థితి

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:42 AM ఏలూరుGeneral
పాములా మెలికలు.. కొబ్బరి బొండాలు కోయలేని పరిస్థితి - Ushodayam
ఏలూరు జిల్లా కైకలూరులోని రైలు వంతెన రోడ్డులో పాములా మెలికలు తిరిగిన కొబ్బరి చెట్టు చూపరులను ఆకట్టుకుంటోంది. పొలం గట్టుపై నాటిన ఈ చెట్టు విచిత్రంగా వంపులు తిరిగి పెరిగిందని రైతు తెలిపారు. చెట్టు ఆకారం భిన్నంగా ఉన్నప్పటికీ కాయలు బాగానే కాస్తున్నాయని చెప్పారు. అయితే వంపుల కారణంగా చెట్టెక్కి బొండాలు కోయడం సాధ్యం కావడం లేదన్నారు. దీంతో కాయలు ఎండిపోయి రాలిపోయే వరకు అలాగే వదిలేస్తున్నట్లు వివరించారు.

Comments

G
Loading comments...