Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లాలున్నా తీరని నీటి కష్టాలు

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:15 PM నారాయణపేటGeneral
నల్లాలున్నా తీరని నీటి కష్టాలు - Ushodayam
ఊట్కూర్‌ మండలం లక్ష్మీపల్లిలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 120 ఇళ్లలో 117 ఇళ్లకు మిషన్‌ భగీరథ కనెక్షన్లు ఉన్నా వారానికి ఒక్కసారే నీరు వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఏకైక బోరు పది నిమిషాలకే ఆగిపోవడంతో నీటి కష్టాలు పెరిగాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ బోర్ల వద్దకు బిందెలతో వెళ్లాల్సి వస్తోందని, అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...