Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగదు చలామణి వృద్ధిలో ఐదేళ్ల రికార్డు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:53 PM జాతీయంవాణిజ్యం
నగదు చలామణి వృద్ధిలో ఐదేళ్ల రికార్డు - Ushodayam
దేశంలో చలామణిలో ఉన్న నగదు విలువ అక్టోబరు 15 నాటికి రూ.43.46 లక్షల కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 13.5 శాతం పెరిగిందని, ఇది ఐదేళ్ల గరిష్ఠ వృద్ధి అని తెలిపింది. రిజర్వ్‌ మనీ 10.3 శాతం పెరిగి రూ.53.24 లక్షల కోట్లకు చేరింది. విదేశీ కరెన్సీ డిపాజిట్లు, ద్రవ్య లభ్యత పెంచే చర్యలు ఈ వృద్ధికి కారణాలుగా భావిస్తున్నారు. పండగల వేళ నగదు వినియోగం పెరిగే అవకాశముంది.

Comments

G
Loading comments...