Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూతపడిన పాఠశాలకు రూ.10 లక్షలతో ప్రహరీ!

Follow Ushodayam on Google
Kiran Oct 15, 2026 12:44 PM మహబూబాబాద్ General
మూతపడిన పాఠశాలకు రూ.10 లక్షలతో ప్రహరీ! - Ushodayam
మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం అందుగులగూడెంలోని ఐటీడీఏ ప్రాథమిక పాఠశాల రెండేళ్ల క్రితం విద్యార్థులు లేక మూతపడింది. తాజాగా పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రహరీ నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సిద్ధమవుతుండటంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మూతపడిన పాఠశాలకు నిధులు కేటాయించడంపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...