Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోతెలో చూపరులను ఆకట్టుకుంటున్న కాశిపూలు

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 1:12 PM సూర్యాపేటGeneral
మోతెలో చూపరులను ఆకట్టుకుంటున్న కాశిపూలు - Ushodayam
మోతె మండలంలోని ఉర్లుగొండ, కూడలి, నరసింహపురం గ్రామాల మధ్య ప్రవహిస్తున్న పాలేరు వాగు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది. వాగు ఇరువైపులా విరబూసిన తెల్లని కాశిపూలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గాలికి మెల్లగా ఊగే కాశిగడ్డి తెల్లని పూలతోటను తలపిస్తోంది. నీటిలో చెట్లు, పూల ప్రతిబింబాలు మరింత అందాన్ని చేకూరుస్తుండటంతో ప్రయాణికులు ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ సెల్‌ఫోన్లలో చిత్రాలు బంధిస్తున్నారు.

Comments

G
Loading comments...