Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

LIC క్యూ2 లాభం రూ.12,076 కోట్లు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:57 PM జాతీయంవాణిజ్యం
LIC క్యూ2 లాభం రూ.12,076 కోట్లు - Ushodayam
ఎల్‌ఐసీ ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.12,076 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో వచ్చిన రూ.10,053 కోట్లతో పోలిస్తే 20 శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.2,62,739 కోట్లకు చేరింది. ప్రీమియం ఆదాయం రూ.1,47,018 కోట్లకు, రెన్యూవల్‌ ప్రీమియం రూ.68,375 కోట్లకు పెరిగాయి. మొదటి ఏడాది ప్రీమియం మాత్రం రూ.10,432 కోట్లకు తగ్గింది.

Comments

G
Loading comments...