Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో అమరవీరుల స్మరణకు 10కే రన్

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:33 AM కాకినాడGeneral
కాకినాడలో అమరవీరుల స్మరణకు 10కే రన్ - Ushodayam
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఆదేశాలతో మంగళవారం కాకినాడలో 10కే రన్‌ నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం వద్ద అదనపు ఎస్పీ కిషోర్ కుమార్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సాగిన రన్‌ సర్పవరం, అచ్చంపేట జంక్షన్ల మీదుగా తిరిగి ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ శ్రీహరిరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...