Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 10:47 AM జనగామ General
జనగామలో ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు - Ushodayam
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని నిరసిస్తూ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో జనగామలో పోలీసులు సోమవారం ముందస్తు అరెస్టులు చేశారు. ముట్టడిలో పాల్గొనకుండా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులను ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన తమను అరెస్టు చేయడం సరికాదని పేర్కొంటూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...