Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ఎన్నికల మాఫియా పెచ్చరిల్లుతోంది: ఎంపీ గురుమూర్తి

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 2:38 PM గుంటూరుGeneral
ఏపీలో ఎన్నికల మాఫియా పెచ్చరిల్లుతోంది: ఎంపీ గురుమూర్తి - Ushodayam
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బుల దందా జరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. టీడీపీ అభ్యర్థుల ఏకగ్రీవ విజయం కోసం ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారని ట్వీట్‌ చేశారు. ప్రతిపక్షాల నామినేషన్లను అడ్డుకుంటున్నారని, పోలీసులు, ఎన్నికల అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...