Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ కేసులో కట్టెవరం వాసికి జైలు

Follow Ushodayam on Google
Anuroop Oct 16, 2026 3:01 PM గుంటూరుGeneral
డ్రగ్స్ కేసులో కట్టెవరం వాసికి జైలు - Ushodayam
అక్రమంగా మాదకద్రవ్యాల రసాయనాలు తయారు చేసిన కేసులో ముగ్గురికి 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖ ఎన్డీపీఎస్ కోర్టు తీర్పునిచ్చింది. ఒక్కొక్కరికి రూ.4 లక్షల జరిమానా విధించింది. 2023లో అచ్యుతాపురం వద్ద ఎన్సీబీ అధికారులు నిందితులను పట్టుకున్నారు. శిక్ష పడిన వారిలో గుంటూరు జిల్లా తెనాలి మండలం కట్టెవరం గ్రామానికి చెందిన బి. నాగేశ్వరరావు ఉన్నారు. మరో ఇద్దరు నల్లగొండ, కరీంనగర్‌కు చెందినవారు.

Comments

G
Loading comments...