Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీ యత్నం.. దొంగలను పట్టుకున్న స్థానికులు

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 6:47 AM హైదరాబాద్General
చోరీ యత్నం.. దొంగలను పట్టుకున్న స్థానికులు - Ushodayam
హయత్‌నగర్‌లో పట్టపగలే చోరీకి యత్నించిన దొంగలను కాలనీవాసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కృష్ణారెడ్డి లేఔట్‌లో బుధవారం మధ్యాహ్నం శ్రీకాంత్ ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారం, నగదు దోచుకునేందుకు ప్రయత్నించారు. అనుమానాస్పద కదలికలను గమనించిన సుప్రభాత్ కాలనీవాసులు దొంగలను ఇంట్లోనే బంధించారు. సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాలనీలో భద్రత పెంచాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...