Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ వేడుకల్లో వివాదం.. సర్పంచ్‌పై కేసు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 10:33 AM జనగామ General
బతుకమ్మ వేడుకల్లో వివాదం.. సర్పంచ్‌పై కేసు - Ushodayam
బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం శివారు సదాశివపేటలో సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా రాజకీయ పాటల విషయంలో వివాదం చోటుచేసుకుంది. రాజకీయ పాటలు వద్దన్నందుకు తన భర్త శ్రీనివాస్‌తో పాటు తనపై సర్పంచ్ పోతుల వెంకటేశ్ దాడి చేసి గాయపరిచారని కొయ్యడ రజిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజిత ఫిర్యాదు మేరకు సర్పంచ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

Comments

G
Loading comments...