Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీకర ఫామ్‌లో బదోని

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 6:49 PM జాతీయంక్రీడలు
భీకర ఫామ్‌లో బదోని - Ushodayam
రంజీ ట్రోఫీ 2026-27లో ఢిల్లీ కెప్టెన్‌ ఆయుశ్‌ బదోని వరుస ఇన్నింగ్స్‌ల్లో అదరగొడుతున్నాడు. బెంగాల్‌పై 85 పరుగులు చేసిన అతడు, గుజరాత్‌పై 217 పరుగులతో డబుల్‌ సెంచరీ సాధించాడు. తాజాగా జార్ఖండ్‌తో మ్యాచ్‌లోనూ సెంచరీ బాదాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 122 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. బదోని, సుమిత్‌ మాథుర్‌ (50*) రాణించడంతో ఢిల్లీ తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...