Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలా త్రిపురసుందరీ అలంకారంలో అంబాభవాని

Follow Ushodayam on Google
Kiran Oct 12, 2026 12:38 PM రంగారెడ్డి General
బాలా త్రిపురసుందరీ అలంకారంలో అంబాభవాని - Ushodayam
ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్ట సమీపంలోని అంబాభవాని మాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Comments

G
Loading comments...