Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలమూరులో 9 వేల ఎకరాల్లో వరి పంట నష్టం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:57 PM కోనసీమGeneral
ఆలమూరులో 9 వేల ఎకరాల్లో వరి పంట నష్టం - Ushodayam
ఆలమూరు మండలంలో తుఫాన్ ప్రభావంతో సుమారు 9 వేల ఎకరాల్లో వరి పంట నేలవాలి, నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. మొత్తం 9,874 ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేసినట్లు ఏడీఏ సీహెచ్ కేవీ చౌదరి తెలిపారు. పొలాల్లో నీరు తొలగించి, వరి దుబ్బులను కట్టలుగా కట్టాలని సూచించారు. మాగుడు తెగులు నివారణకు ప్రాపికోనజోల్, గింజ మొలకెత్తకుండా ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...