Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

23వ అంతస్తు నుంచి పడి తండ్రీకొడుకు దుర్మరణం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 6:05 PM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడాలో పూజ కోసం పూలు కోస్తుండగా బాల్కనీ నుంచి జారిపడి తండ్రీకొడుకు మృతిచెందారు. మహాగున్ మైవుడ్స్ సొసైటీలో శుక్రవారం ఉదయం రన్‌దీప్ పాత్రా (40), కుమారుడు ఆరవ్ (11) ప్రమాదానికి గురయ్యారు. కుమారుడిని రక్షించే ప్రయత్నంలో తండ్రి కూడా 23వ అంతస్తు నుంచి జారిపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఇద్దరూ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...