Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుపాకీ గాయాలతో 19 నెలల చీతా మృతి

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 4:47 PM జాతీయంGeneral
తుపాకీ గాయాలతో 19 నెలల చీతా మృతి - Ushodayam
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌ పరిధిలో 19 నెలల మగ చీతా KNG22 చికిత్స పొందుతూ మృతి చెందింది. అక్టోబర్‌ 25న షియోపూర్‌ టెరిటోరియల్‌ డివిజన్‌లో తీవ్ర గాయాలతో దాన్ని గుర్తించారు. చీతా శరీరంలో ఐదు తుపాకీ గుళ్లను గుర్తించిన వైద్యులు, అత్యవసర శస్త్రచికిత్స చేసినా ప్రాణాలు కాపాడలేకపోయారు. ఘటనపై దర్యాప్తునకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

Comments

G
Loading comments...