Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి హెడ్‌ కానిస్టేబుల్‌.. కూతురు డీఎస్పీగా ఎంపిక

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 2:53 PM వరంగల్General
తండ్రి హెడ్‌ కానిస్టేబుల్‌.. కూతురు డీఎస్పీగా ఎంపిక - Ushodayam
ఎక్సైజ్‌ శాఖ హెడ్‌ కానిస్టేబుల్‌ ఖదీర్‌ కుమార్తె షా గుఫ్తా యాస్మిన్‌ తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌–1లో డీఎస్పీగా ఎంపికయ్యారు. భూపాలపల్లి జిల్లా కాటారానికి చెందిన ఖదీర్‌ ప్రస్తుతం రామగుండంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వరంగల్‌లో ప్రాథమిక విద్య, హైదరాబాద్‌లో ఇంటర్‌, ఢిల్లీలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన యాస్మిన్‌ డీఎస్పీ శిక్షణ కూడా పూర్తిచేశారు. గద్వాలలో ట్రెయినీ డీఎస్పీగా విధులు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...