Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో జైలు నుంచి 17 మంది పరార్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 9:13 AM జాతీయంGeneral
తమిళనాడులో జైలు నుంచి 17 మంది పరార్‌ - Ushodayam
తమిళనాడులోని తేని జిల్లా సబ్‌జైలు నుంచి సోమవారం అర్ధరాత్రి 17 మంది ఖైదీలు పరారయ్యారు. ఓ ఖైదీ మూర్ఛపోయినట్లు నటించగా, సిబ్బంది సెల్‌లోకి వెళ్లిన సమయంలో వారిపై దాడి చేసి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. పరారైన వారిలో ఒకరిని పోలీసులు తిరిగి అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం 17 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. 16 ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...