Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలి: ఏవో

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 4:46 PM మహబూబాబాద్ General
తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలి: ఏవో - Ushodayam
తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని గార్ల మండల వ్యవసాయ అధికారి రామారావు రైతులకు సూచించారు. పోచారం రైతు వేదికలో సర్పంచ్ రమ్యతో కలిసి నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. పంట మార్పిడితో చిరుధాన్యాలు, పప్పుదినుసులు, కూరగాయలు సాగు చేస్తే తక్కువ నీటితో అధిక లాభాలు పొందవచ్చన్నారు. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు.

Comments

G
Loading comments...