Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో 1,395 FBO పోస్టుల భర్తీ

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 3:50 PM హైదరాబాద్General
తెలంగాణలో 1,395 FBO పోస్టుల భర్తీ - Ushodayam
తెలంగాణ అటవీశాఖలో 1,395 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుందని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రతిపాదనలు అందిన మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. దరఖాస్తులకు నెల రోజులు, పరీక్షకు రెండు నెలల సమయం ఇవ్వనున్నారు. పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించి, మూడు వారాల్లో ఫలితాలు వెల్లడించనున్నారు.

Comments

G
Loading comments...