Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి పనులు వేగవంతం చేయాలి: సీతక్క

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 2:44 PM ములుగు General
సాగునీటి పనులు వేగవంతం చేయాలి: సీతక్క - Ushodayam
ములుగు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాగునీటి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి, రామప్ప, లక్నవరం పనులు వేగవంతం చేయాలని సూచించారు. భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని, చిన్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణ అవకాశాలను పరిశీలించి రైతులకు శాశ్వత సాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...