Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజర్వేషన్లపై పేర్ని నాని వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 01, 2026 12:01 PM కృష్ణా జిల్లాGeneral
రిజర్వేషన్లపై పేర్ని నాని వ్యాఖ్యలు - Ushodayam
మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో డివిజన్ల రిజర్వేషన్లపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తోందని ఆయన ఆరోపించారు. తమకు అనుకూలంగా రిజర్వేషన్లు ఖరారైనా వైసీపీ నుంచి సామాన్య కార్యకర్తలను పోటీలో నిలుపుతామని తెలిపారు. శారదానగర్‌, కాలేఖాన్‌పేట, బలరామునిపేట, పాతరామన్నపేట, ముస్తాఖాన్‌పేట డివిజన్లు ఎస్సీ అవుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...