Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాల 22వ వార్డులో పారిశుద్ధ్య సమస్య

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 9:46 AM హన్మకొండ General
పరకాల 22వ వార్డులో పారిశుద్ధ్య సమస్య - Ushodayam
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు పద్మశాలి వీధి, ముదిరాజ్‌వాడలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. ప్రధాన రహదారి పక్కన చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. డ్రైనేజీ కాల్వలు చెత్తతో నిండిపోవడంతో మురుగునీరు నిలిచి దోమలు పెరుగుతున్నాయి. దీంతో సీజనల్ వ్యాధుల భయం నెలకొంది. అధికారులు వెంటనే చెత్త తొలగించి, కాల్వలను శుభ్రం చేయాలని వార్డువాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...