Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని దీపావళి కానుక పేరుతో సైబర్ మోసం

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 8:16 PM హైదరాబాద్General
ప్రధాని దీపావళి కానుక పేరుతో సైబర్ మోసం - Ushodayam
ప్రధానమంత్రి దీపావళి కానుక పేరుతో రూ.8 వేల నగదు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో నకిలీ లింక్‌లు పంపుతున్నారు. వాటిపై క్లిక్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు చోరీ అయ్యే ప్రమాదముందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఇలాంటి సందేశాలను నమ్మొద్దని, ఓటీపీలు, యూపీఐ పిన్‌లు, పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పొద్దని సూచించింది. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపింది.

Comments

G
Loading comments...