Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యతలేని భోజనంపై ఫిర్యాదులు

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:33 AM వరంగల్General
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యతలేని భోజనంపై ఫిర్యాదులు - Ushodayam
జనగామ జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు నాణ్యతలేని భోజనం అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, బచ్చన్నపేట ఆసుపత్రుల్లో నిర్దేశించిన ఆహార పట్టిక అమలు కావడం లేదని రోగులు వాపోతున్నారు. అల్పాహారం, అన్నం, పాలు, గుడ్లు తగినంతగా అందడం లేదని చెబుతున్నారు. భోజన నాణ్యతపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...