Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పామర్రులో తాళం వేసిన ఇంట్లో చోరీ

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:29 PM కృష్ణా జిల్లాGeneral
పామర్రులో తాళం వేసిన ఇంట్లో చోరీ - Ushodayam
కృష్ణా జిల్లా పామర్రు మండలం కొరిమెర్లలో తాళం వేసిన ఇంట్లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంటి యజమాని ఓటు వేసి గన్నవరంలో శుభకార్యానికి వెళ్లిన సమయంలో దుండగులు తలుపులు బద్దలుకొట్టి బంగారు, వెండి వస్తువులతో పాటు నగదు అపహరించారు. ఘటనా స్థలాన్ని సీఐ నాగప్రసాద్, ఎస్‌ఐ శ్రీనివాసు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నట్లు సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...