Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనల ఉల్లంఘన.. 9 లైసెన్సుల సస్పెన్షన్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:15 AM వరంగల్General
నిబంధనల ఉల్లంఘన.. 9 లైసెన్సుల సస్పెన్షన్‌ - Ushodayam
వరంగల్‌, హనుమకొండలో ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించిన తొమ్మిది తయారీ కేంద్రాల లైసెన్సులను సస్పెండ్‌ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గురువారం మిఠాయిల తయారీ కేంద్రాలు, నూనె మిల్లులు, ఆహార ప్రాసెసింగ్‌ యూనిట్లలో తనిఖీలు నిర్వహించారు. నాలుగు సంస్థలకు షోకాజ్‌ నోటీసులు, మరో సంస్థకు హెచ్చరిక జారీ చేశారు. ఆహార నమూనాలను పరీక్షలకు పంపారు. నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...