Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట ఆలయానికి 79 స్టీల్‌ కంచాల వితరణ

Follow Ushodayam on Google
Anuroop Sep 03, 2026 4:06 PM అనకాపల్లి General
కొత్తకోట ఆలయానికి 79 స్టీల్‌ కంచాల వితరణ - Ushodayam
రావికమతం మండలం కొత్తకోటలోని షిరిడి సాయిబాబా ఆలయానికి గ్రామానికి చెందిన వ్యాపారులు దొరబాబు, సత్తిబాబు గురువారం 79 స్టీల్‌ కంచాలను వితరణగా అందించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గురువారం ఉచిత అన్నసమారాధన నిర్వహిస్తున్నారు. గతంలో పీవీసీ కోటెడ్‌ ప్లేట్లతో చెత్త పేరుకుపోతుండటంతో పర్యావరణహితంగా స్టీల్‌ కంచాలను సమకూర్చినట్లు వ్యాపారులు తెలిపారు.

Comments

G
Loading comments...