Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిగూడలో భూ రీ సర్వే పనుల పరిశీలన

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 6:31 PM నల్గొండGeneral
మర్రిగూడలో భూ రీ సర్వే పనుల పరిశీలన - Ushodayam
మర్రిగూడ మండలం తమ్మడపల్లిలో జరుగుతున్న భూ రీ సర్వే పనులను ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మంగళవారం తహశీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. సర్వే పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రామకంఠం, ఇనామ్, ప్రభుత్వ, రైతుల భూముల హద్దులను కచ్చితంగా కొలిచి గుర్తులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ పాండురంగారెడ్డి, జీపీఓ గిరి, సర్వేయర్ రవి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...