Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోవిలాం కాలనీ వద్ద బురదలో దిగిన లారీ

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:38 AM శ్రీకాకుళంGeneral
కోవిలాం కాలనీ వద్ద బురదలో దిగిన లారీ - Ushodayam
ఎల్.ఎన్.పేట మండలం కోవిలాం కాలనీ సమీపంలోని అలికాం–బత్తిలి రోడ్డు పక్కన లారీ బురదలో దిగిపోయింది. హిరమండలం నుంచి సరుబుజ్జిలి వెళ్తున్న లారీకి ఎదురుగా మరో వాహనం రావడంతో దారి ఇచ్చేందుకు రోడ్డు పక్కకు వెళ్లింది. అదే సమయంలో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండటంతో లారీ బురదలో కూరుకుపోయింది. వరద నీరు తగ్గిన తర్వాతే లారీని బయటకు తీసే అవకాశం ఉందని డ్రైవర్ తెలిపారు.

Comments

G
Loading comments...