Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ క్రికెట్‌కు మనోజ్ఞ ఎంపిక

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 7:03 AM నిజామాబాద్General
జాతీయ క్రికెట్‌కు మనోజ్ఞ ఎంపిక - Ushodayam
నిజామాబాద్‌కు చెందిన మనోజ్ఞ నాయక్‌ (13) జాతీయ స్థాయి పాఠశాల క్రికెట్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఏడాది క్రితం ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్‌ బాగారెడ్డి ఉచిత శిక్షణ ఇచ్చారు. క్రమశిక్షణతో సాధన చేసిన మనోజ్ఞ రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించారు. నల్గొండపై 25, ఆదిలాబాద్‌పై 35, రంగారెడ్డిపై 42 పరుగులు సాధించారు. నవంబరులో జమ్మూకశ్మీర్‌లో జరిగే పోటీల్లో తెలంగాణ తరఫున బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌గా పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...