Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై సర్పంచుల ఆందోళన

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 3:55 PM నల్గొండGeneral
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై సర్పంచుల ఆందోళన - Ushodayam
మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై రసాభాస చోటుచేసుకుంది. కేబీపల్లి సర్పంచ్ పందుల జయలక్ష్మి, ఎరుగండ్లపల్లి సర్పంచ్ సంతోష్ యాదవ్ తమకు ఎంపిక ప్రక్రియపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవో తమకు సమాచారం ఇవ్వడం లేదని, అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...