Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోటలో గ్యాస్ సిలిండర్ల కోసం మహిళల ఆందోళన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:18 PM విజయనగరంGeneral
ఎస్.కోటలో గ్యాస్ సిలిండర్ల కోసం మహిళల ఆందోళన - Ushodayam
ఎస్.కోట మండలం వినాయకపల్లిలో గ్యాస్ సిలిండర్ల కొరతపై మహిళలు ఆందోళన చేపట్టారు. శనివారం గ్రామానికి అరకొరగా సిలిండర్లు తీసుకురావడంతో సిబ్బందిని అడ్డుకుని నిరసన తెలిపారు. నెలకు ఒకసారి కూడా సరిపడా గ్యాస్ సిలిండర్లు రావడం లేదని మహిళలు ఆరోపించారు. గ్రామంలోని అందరికీ పూర్తి స్థాయిలో గ్యాస్ అందించే వరకు వాహనాన్ని వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. అధికారులు సమస్య పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...