Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ అభ్యర్థిపై పోలీసుల దౌర్జన్యమని వైకాపా ఆరోపణ

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 8:49 PM నెల్లూరుGeneral
ఎంపీటీసీ అభ్యర్థిపై పోలీసుల దౌర్జన్యమని వైకాపా ఆరోపణ - Ushodayam
నెల్లూరు జిల్లా చిరమనలో వైకాపా ఎంపీటీసీ అభ్యర్థిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లేందుకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి. పొలంలో పశువులు మేపుతుండగా కేసులు ఉన్నాయంటూ ఏఎస్‌పేట ఎస్సై తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో దాఖలు చేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని అభ్యర్థిపై ఒత్తిడి తెచ్చారని వైకాపా ఆరోపించింది. ఎన్నికల సంఘం హెచ్చరికలను పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించింది.

Comments

G
Loading comments...