Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెతో వైద్య సేవలకు అంతరాయం

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 12:54 PM కరీంనగర్General
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెతో వైద్య సేవలకు అంతరాయం - Ushodayam
కరీంనగర్‌ మాతా శిశు ఆసుపత్రి (ఎంసీహెచ్‌)లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె 12వ రోజుకు చేరింది. వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు సహా 35 మంది విధులు బహిష్కరించడంతో నవజాత శిశు, మెటర్నిటీ, ల్యాబ్‌ విభాగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...