Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరిత్ర సృష్టించిన నమీబియా కెప్టెన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 6:31 PM జాతీయంక్రీడలు
చరిత్ర సృష్టించిన నమీబియా కెప్టెన్‌ - Ushodayam
నమీబియా కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 156 పరుగులతో అజేయంగా నిలిచి, అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ జట్టుపై సెంచరీ చేసిన తొలి నమీబియా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఎరాస్మస్‌ 125 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగగా.. జాన్‌ ఫ్రైలింక్‌ 76 పరుగులు చేశాడు. దీంతో నమీబియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 321 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...