Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో కారు డ్రైవర్‌కు ఏడాది జైలు

Follow Ushodayam on Google
dineshkumar Sep 09, 2026 6:35 PM చిత్తూరుGeneral
చిత్తూరులో కారు డ్రైవర్‌కు ఏడాది జైలు - Ushodayam
చిత్తూరులో అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మృతికి కారణమైన కారు డ్రైవర్‌ కె.ఆర్. సుబ్రమణ్యరావుకు 3వ ఏడీఎంఎం కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.13 వేల జరిమానా విధించింది. 2023 నవంబర్‌ 3న మారుతి సుజుకి షోరూమ్‌ ఎదుట కారు ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న బి.రఘు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ట్రాఫిక్‌ పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించడంతో నేరం రుజువైంది.

Comments

G
Loading comments...