Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:07 AM గుంటూరుGeneral
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి - Ushodayam
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మంగళవారం జరిగిన ఘటనపై తెనాలి GRP SI ఎల్. సరస్వతి వివరాలు వెల్లడించారు. మృతుడి వయసు 25–30 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. అతడి వద్ద గుర్తింపు పత్రాలు లభించలేదని తెలిపారు. కేసు నమోదు చేసి మృతుడి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...