Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో జారిపడి వ్యక్తి మృతి.. బైరాపూర్‌లో విషాదం

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 9:44 PM నిజామాబాద్General
చెరువులో జారిపడి వ్యక్తి మృతి.. బైరాపూర్‌లో విషాదం - Ushodayam
బైరాపూర్‌లో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మల్లెల శ్యామ్‌ (45) మృతి చెందారు. రజక వృత్తి చేసే శ్యామ్‌ శనివారం దుస్తులు ఉతికేందుకు గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లి నీటిలో మునిగిపోయారని ఎస్సై రాములు తెలిపారు. మధ్యాహ్నం ఇంటికి రాకపోవడంతో కుమారుడు చెరువు వద్దకు వెళ్లి చూడగా దుస్తులు కనిపించాయి. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. భార్య వినోద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...