Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో విద్యుత్, నీటి సరఫరా లేక ఇబ్బందులు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 3:11 PM పశ్చిమగోదావరి General
భీమవరంలో విద్యుత్, నీటి సరఫరా లేక ఇబ్బందులు - Ushodayam
తుపాను ప్రభావంతో భీమవరంలో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణం అంధకారంలోకి వెళ్లింది. కుళాయి నీరు, ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నీటి కోసం ట్యాంకర్లు, లీకేజీల వద్ద బారులు తీరారు. ఫ్రిజ్‌లలో ఆహార పదార్థాలు పాడవడంతో టిఫిన్ సెంటర్లు, హోటళ్లను ఆశ్రయించారు. జనరేటర్లతో నడుస్తున్న పెట్రోల్ బంకుల వద్ద ఇంధనం కోసం భారీగా క్యూ కట్టారు.

Comments

G
Loading comments...