Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 2:27 PM జాతీయంవాణిజ్యం
అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు - Ushodayam
దేశంలో అక్టోబర్‌ నెల స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు దాటినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 23 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ లావాదేవీల ద్వారా రూ.1.59 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. దిగుమతుల ద్వారా రూ.72,246 కోట్లు వసూలయ్యాయి. రిఫండ్ల రూపంలో రూ.27,934 కోట్లు చెల్లించగా, నికర వసూళ్లు రూ.2.03 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

Comments

G
Loading comments...