Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అహోబిలంలో ఘనంగా మహా పూర్ణాహుతి

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:19 PM నంద్యాలGeneral
అహోబిలంలో ఘనంగా మహా పూర్ణాహుతి - Ushodayam
నంద్యాల జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా మహా పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద స్వామి, అమ్మవార్లకు యాగశాలలో ప్రాయశ్చిత్త హోమం జరిపి పూర్ణాహుతి గావించారు. అనంతరం స్వామివారిని గర్భాలయంలోకి తీసుకెళ్లి పంచామృతాభిషేకం, కుంభప్రోక్షణ చేయడంతో ఉత్సవాలు ముగిశాయి. ఈ వేడుకలో భక్తులు విశేషంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...