Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

53 కేజీల విభాగంలోకి మీరాబాయి చాను

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 10:46 AM జాతీయంక్రీడలు
53 కేజీల విభాగంలోకి మీరాబాయి చాను - Ushodayam
భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను తొలిసారిగా 53 కేజీల విభాగంలో పోటీపడనుంది. 2028 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో 48/49 కేజీల విభాగం తొలగించడంతో ఆమె కొత్త విభాగానికి మారింది. ఇందుకోసం బరువు పెంచుకుని ప్రత్యేకంగా సాధన చేసింది. చైనాలోని నింగ్‌బోలో గురువారం ప్రారంభమయ్యే ఐడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మీరాబాయితో పాటు జ్ఞానేశ్వరి యాదవ్‌ కూడా 53 కేజీల విభాగంలో బరిలోకి దిగనున్నారు.

Comments

G
Loading comments...