Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాసంగిలో ఆరుతడి పంటలే మేలు: ఎంఏఓ

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:41 PM జగిత్యాలGeneral
యాసంగిలో ఆరుతడి పంటలే మేలు: ఎంఏఓ - Ushodayam
మల్లాపూర్‌ మండలం సాతారంలో శనివారం నిర్వహించిన సాగు సంరక్షణ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడారు. యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసి నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. డ్రిప్‌, స్ప్రింక్లర్‌ సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని, నీటి సంరక్షణకు ఫామ్‌ పాండ్స్‌, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...